Parliament | పార్లమెంట్​లో మన ఎంపీల హాజరు శాతం ఎంతంటే..

Parliament | పార్లమెంట్​లో మన ఎంపీల హాజరు శాతం ఎంతంటే..
Parliament | పార్లమెంట్​లో మన ఎంపీల హాజరు శాతం ఎంతంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament | ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్(​Parliament) పాత్ర చాలా కీలకం. చట్టాల తయారీ, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్​లో సభ్యులు చర్చిస్తారు. అయితే తెలంగాణ నుంచి లోక్​సభ(Loksabha members from Telangana)కు ఎన్నికైన సభ్యులు పార్లమెంట్​ సమావేశాల్లో ఎలా పాల్గొన్నారో చూద్దాం. జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన వివరాలను ఇటీవల వెల్లడించారు.

Advertisement

ఇందులో వందశాతం అటెండెన్స్​తో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(mp Chamala Kiran Kumar Reddy) టాప్‌లో నిలిచారు. ఆయన 79 ప్రశ్నలు వేసి, 17 చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి konda vishweshwar reddy 95 శాతం హాజరుతో రెండో స్థానంలో ఉండగా, ఈటల రాజేందర్(Etala Rajender) అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి, 91 శాతం హాజరయ్యారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్​ ఎంపీ రఘువీర్​ ఒక్క డిబేట్​లో కూడా పాల్గొనలేదు. ఆయన 72 శాతం హాజరు శాతంతో ఆయన 8 ప్రశ్నలు మాత్రమే వేశారు.

Parliament | మిగతా ఎంపీల వివరాలు..

డీకే అరుణ(DK Aruna) 88శాతం హాజరుతో, 73 ప్రశ్నలు వేసి, 14 చర్చల్లో పాల్గొన్నారు. ధర్మపురి అర్వింద్ mp Dharmapuri Arvind ​ 88శాతం సమావేశాలకు హాజరయ్యారు. 59 ప్రశ్నలు వేసిన ఆయన రెండు చర్చల్లో పాల్గొన్నారు. సురేశ్​ షెట్కార్ mp suresh shetkar​ 86 శాతం హాజరుతో, 62 ప్రశ్నలు వేసి, ఐదు చర్చల్లో ప్రసంగించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Supreme Court | వక్ఫ్ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

మల్లు రవి(Mallu Ravi) 92శాతం హాజరై, 28 ప్రశ్నలు వేశారు. పది డిబేట్లలో ఆయన మాట్లాడారు. రఘురామ్​ రెడ్డి 85 శాతం హాజరు, 56 ప్రశ్నలు, 9 చర్చల్లో పాల్గొన్నారు. బలరాం నాయక్​ 72శాతం హాజరుతో 13 ప్రశ్నలు వేశారు. ఆయన మూడు డిబేట్లలో మాత్రమే పాల్గొనడం గమనార్హం. 97శాతం హాజరుతో 46 ప్రశ్నలు వేసిన రఘునందన్​రావు(Raghunandan Rao) ఏడు చర్చల్లో మాట్లాడారు.

గోడెం నగేశ్(Godem Nagesh)​ 92శాతం హాజరయ్యారు. 40 ప్రశ్నలు వేసిన ఆయన 4 చర్చల్లో పాల్గొన్నారు. గడ్డం వంశీకృష్ణ 89 శాతం హాజరు, 31 ప్రశ్నలు, 7 చర్చల్లో పార్టిసిపేట్​ అయ్యారు. కడియం కావ్య 83 శాతం సమావేశాలకు హాజరై 31 ప్రశ్నలు అడిగారు. ఐదు డిబేట్లలో పాల్గొన్నారు.

Advertisement