అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sixth Great Planetary Alliance : మయన్మార్‌లో కేంద్రీకృతమై సంభవించిన భూకంపం ఆగ్నేయాసియాను కుదిపేసింది. దీని వల్ల అనేక మంది మరణించారు. అపారమైన నష్టం వాటిల్లింది. భూకంపం కారణంగా ఐదు నగరాలు, పట్టణాల్లో ఆకాశ హర్మ్యాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం ఎంతనేది ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదు.
యాంగోన్ – మండలే ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న రైల్వే వంతెన, రోడ్డు వంతెన కూలిపోయాయి. ఇరావడీ నదిపై ధ్వంసమైన అవా వంతెన, దాని తోరణాలు నీటిలోకి వంగిపోయాయి. బ్యాంకాక్‌లో కూలిన భవనం శిథిలాలలో 81 మంది చిక్కుకుపోయారు.
సాయుధ తిరుగుబాటుకు వ్యతిరేకంగా అంతర్యుద్ధం ఎదుర్కొంటున్న మయన్మార్ పాలక సైన్యాన్ని భూకంపం మరింత కుంగదీసింది. సైనిక దళాలు అనేక ప్రాంతాలలో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
మయన్మార్‌లోని టౌంగూ పట్టణంలో ఒక మసీదు పాక్షికంగా కూలిపోయి, ముగ్గురు మరణించారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆంగ్ బాన్‌లో ఒక హోటల్ కూలిపోవడంతో కనీసం ఇద్దరు మరణించారని, 20 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.
Sixth Great Planetary Alliance : దక్షిణ కొరియాలో
ఇటీవల దక్షిణ కొరియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది. దేశ దక్షిణ ప్రాంతం మంటల్లో చిక్కుకుపోయింది. ఇల్లు, ఫ్యాక్టరీలు, స్కూళ్లు, పురాతన బౌద్ధ దేవాలయాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. వాటిలో 1668లో వాగుపై నిర్మించిన పెవిలియన్ ఆకారపు నిర్మాణం, 1904లో రాజు జోసెయోన్ రాజవంశం భవనం ఉన్నాయి. 24 మంది సజీవ దహనమయ్యారు. సుమారు 27 వేల మంది నిరాశ్రయులయ్యారు.
శతాబ్దాల చరిత్ర గల రాజ భవనాలు, వారధులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దాదాపు 50 వేల ఎకరాల అడవి ఆహుతి అయింది. ఊయిసోంగ్ ప్రాంతమంతా మసి అయింది. కార్చిచ్చు మంటలార్పుతున్న సమయంలో ఓ హెలికాప్టర్ మంటల్లో కూలిపోయింది.
మొన్న ఆమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కూడా కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది. ఇటీవల భూకంపాలు తరచూ ఏర్పడుతున్నాయి. షష్ఠ మహా గ్రహ కూటమికి ముందు ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద డిబెటే కొనసాగుతోంది.
Sixth Great Planetary Alliance : ఏమిటీ ఈ షష్ఠ మహా గ్రహ కూటమి ?
షష్ఠ మహా గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం అని అర్థం. ఇది సాధారణంగా జ్యోతిష్యశాస్త్రంలో ఒక అరుదైన ఘటనగా చెబుతుంటారు. మార్చి 29న ఈ షష్ఠ మహా గ్రహ కూటమి ఏర్పడబోతోంది. దీనిని కొందరు మహా రాజయోగం అని పేర్కొంటారు. ఈ ఘటన కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుందని, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.