Nizamsagar | పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

Nizamsagar | పల్లె దవాఖానాలపై పట్టింపేది?
Nizamsagar | పల్లె దవాఖానాలపై పట్టింపేది?
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు నామమాత్రంగా మారాయి. పల్లె ప్రజలకు చేరువలో వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పలు గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. ఇందుకోసం నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.

జుక్కల్‌ నియోజకవర్గంలో మొత్తం 27 పల్లె దవాఖానాలున్నాయి. వాటిల్లో ఎంబీబీఎస్‌ వైద్యులు, స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం నియమించింది. అయితే మిగతా సిబ్బందిని మాత్రం భర్తీ చేయలేదు. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. అలాగే ఫర్నిచర్‌ కూడా లేకపోవడంతో రోగులు కింద కూర్చుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.’’

Nizamsagar | రోగులకు సరిపోని బెడ్లు..

మహమ్మద్‌ నగర్‌ మండల కేంద్రంలోని పల్లె దవాఖానాకు నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తున్నారు. వారికి సరిపడా అక్కడ సౌ కర్యాలు మాత్రం లేవు. ఆస్పత్రిలో జాయిన్‌ అయిన వారికి బెడ్లు సరిపోని పరిస్థితి ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పల్లె దవాఖానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు సమయపాలన పాటించకట్లేదు. ఫలితంగా ఈ ఆస్పత్రుల్లో ప్రభుత్వం వైద్యం అందట్లేదు. కొన్ని చోట్ల సిబ్బంది లేరన్న సాకుతో వైద్యులు మెక్కుబడిగా విధులకు వచ్చి వెళ్తున్నారనే విమర్శలున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar | ఇసుక డంప్​ల సీజ్​

Nizamsagar | వైద్య సేవలు అందిస్తున్నాం

- అయేషా సిద్ధిఖా, మహమ్మద్‌ నగర్‌ పల్లె దవాఖానా, వైద్యురాలు
– అయేషా సిద్ధిఖా, మహమ్మద్‌ నగర్‌ పల్లె దవాఖానా, వైద్యురాలు

– అయేషా సిద్ధిఖా, మహమ్మద్‌ నగర్‌ పల్లె దవాఖానా, వైద్యురాలు
పల్లె దవాఖానా ద్వారా నిత్యం రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విధులు నిర్వహి స్తున్నాం. ఫర్నిచర్‌తో పాటు కనీస సౌకర్యాలు లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నాం.

Nizamsagar | నిధులు కేటాయించారు

- రోహిత్‌, నిజాంసాగర్‌ కేంద్రం వైద్యుడు
– రోహిత్‌, నిజాంసాగర్‌ కేంద్రం వైద్యుడు

– రోహిత్‌, నిజాంసాగర్‌ కేంద్రం వైద్యుడు
పల్లె దవాఖానాలకు ప్రభుత్వం రూ.80 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇంటర్నె ట్‌కు రూ.5వేలు, ఐఈఏలకు రూ.25 వేలు కేటాయించారు. మిగతావి ఫర్నిచర్‌ కోసం ఉప యోగించాల్సి ఉంటుంది.

Advertisement