అక్షరటుడే, న్యూఢిల్లీ: Allahabad | మహిళ ఛాతిపై చేయి వేయడం, వస్త్రాలు లాగడం అత్యాచారయత్నం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి(Allahabad High Court judge) ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ తీర్పు పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఇలాంటి తీర్పుల వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) కలగజేసుకోవాలని అన్నివర్గాల నుంచి విన్నపాలు వస్తున్నాయి.
అలహాబాద్ హైకోర్టు జడ్జి(Allahabad High Court judge)ఇచ్చిన తీర్పు మహిళల హక్కులు, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలపై చర్చకు దారితీసింది. దేశంలో ఇప్పటికే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ తీర్పుతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందననే ఆందోళన వ్యక్తమవుతోంది. జడ్జి ఇచ్చిన ఈ తీర్పును కేంద్ర మంత్రులతో central minister సహా నాయకులు, మహిళా కమిషన్లు(Women’s Commissions), మానవ హక్కుల కార్యకర్త(human rights activists)లు, న్యాయవాదులు(judge) ఖండిస్తున్నారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి High court judge ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రస్థాయిలో ఖండించారు. అది తప్పుడు తీర్పు అని ఆమె అన్నారు. ఇలాంటి తీర్పులు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు Supreme court కలగజేసుకోవాలని కోరారు.
అలహాబాద్ హైకోర్టు తీర్పుతో దిగ్భ్రాంతి చెందానని ఆప్ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పేర్కొన్నారు.
ఒక మహిళ విషయంలో పురుషులు అలా చేస్తే.. అత్యాచార యత్నం కాదా అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జూన్ మాలియా(mp June Mallya) ప్రశించారు. మన దేశంలో మహిళలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, దీనిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.