అక్షరటుడే, వెబ్డెస్క్ : Results | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు(Inter Exams) పూర్తయ్యాయి. ఇంటర్ బోర్డు మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంటర్ బోర్డు (Inter Board) ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించింది. స్పాట్ వాల్యూయేషన్ వేగవంతంగా జరుగుతోంది.
ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఏదైనా జాప్యం జరిగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని బోర్డు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే సెలవులు ప్రకటించిన బోర్డు ఫలితాలు త్వరగా విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Results | పదో తరగతి రిజల్ట్స్
పదో తరగతి పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగిశాయి. అయితే జవాబు పత్రాలను వాల్యూయేషన్ కేంద్రాలకు అధికారులు తరలించారు. పలు సబ్జెక్టుల మూల్యాంకనం ఇప్పటికే ప్రారంభించారు. దీంతో మే తొలి వారంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని ఎస్ఎస్సీ బోర్డు యోచిస్తోంది.