Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..

Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..
Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajiv Yuva Vikasam | రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత అందించడానికి ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు loans అందించనుంది. ఈ రోజుతో (ఏప్రిల్ 14)​ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ పథకం కింద లోన్లు పొందడానికి దరఖాస్తు applications చేసుకున్నారు. అయితే వారి ఎపికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka కీలక ప్రకటన చేశారు.

Advertisement
Advertisement

రాజీవ్​ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని భట్టి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్​ 2న లబ్ధిదారులకు పత్రాలు అందిస్తామన్నారు. మండలాల వారిగా లబ్ధిదారులకు రుణం మంజూరు పత్రాలు ఇచ్చే ప్రక్రియ జూన్ ​9లోపు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు మూడు రోజుల నుంచి వారం పాటు శిక్షణ ఇస్తామని భట్టి తెలిపారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్​ యువ వికాసం పథకానికి వెల్లువలా దరఖాస్తులు