Watermelon : మీరు పుచ్చకాయను కొనేటప్పుడు.. దాని క్వాలిటీని,వెంటనే ఇలా కనిపెట్టేయవచ్చు… అది ఎలాంటే…?

Watermelon : మీరు పుచ్చకాయను కొనేటప్పుడు.. దాని క్వాలిటీని,వెంటనే ఇలా కనిపెట్టేయవచ్చు... అది ఎలాంటే...?
Watermelon : మీరు పుచ్చకాయను కొనేటప్పుడు.. దాని క్వాలిటీని,వెంటనే ఇలా కనిపెట్టేయవచ్చు... అది ఎలాంటే...?

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Watermelon : మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొన్ని పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిని ఈజీగా, ఇలా క్వాలిటీ గా ఉన్నాయా లేదా అని చెప్పవచ్చు. కానీ పుచ్చకాయ మాత్రం అంత తేలిగ్గా కనిపెట్టలేము. ఎందుకంటే ఈ పుచ్చకాయ లోపటి భాగం ఎర్రగా ఉండాలి అనుకొని, తరువాత మనం కొనుగోలు చేస్తాం. కానీ లోపట భాగం ఎర్రగా ఉందా,బాగా పండిందా,లేదా అనే విషయం మనకు తెలియదు. దీని కోసమై పుచ్చకాయని సగానికి కోసి చూస్తాం… కానీ ఈ టిప్స్ ని ఫాలో అయితే గనుక, ఆ పుచ్చకాయ ఎంత రేట్ అయినా సరే మీరు కొనుక్కొని తినవచ్చు. కానీ పుచ్చకాయలు కొనుగోలు చేసేటప్పుడు అది లోపటి భాగం పండకుండా ఉండటమో, లేదా, చెట్టు నుంచి తెంపి చాలా కాలమై ఉంటే.. ఆ పండు తినడానికి పనికిరాదు. తరువాత మీరు పుచ్చకాయని ఎక్కువ ధర పెట్టి కొన్న ప్రయోజనం ఉండదు.

Advertisement
Advertisement

కాబట్టి ,ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే… పుచ్చకాయ క్వాలిటీని చూడగానే కనిపెట్టేసే ఇలాంటి టిప్స్ ని పాటించారంటే. మీరు పొరపాటున కూడా పుచ్చకాయ కొనే విషయంలో మోసపోరు. పుచ్చకాయ మచ్చలు, ఆకారం, బరువు, గట్టిదనం వంటివి చూసి అది లోపల ఎలా ఉందో ఈజీగా ఈ విధంగా కనిపెట్టవచ్చు.. సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయల వైపు మక్కువ చూపిస్తారు. దీన్ని తెగ కొనేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయని కొనే విషయంలో మాత్రం తప్పులు చేస్తూ ఉంటారు. పుచ్చకాయని కొనుగోలు చేసేటప్పుడు మీకు లోపల ఎర్రగా ఉందా లేదా అనే సందేహం ముందుగా కలుగుతుంది. ముందు కొనేటప్పుడు ఆ పుచ్చకాయల వ్యాపారిని ఒక ముక్క కట్ చేసి చూపించండి అని అడుగుతాము. అలా తీసుకు వెళ్లిన పుచ్చకాయ, రెండు గంటల్లోపే అది పాడే పోయే అవకాశం ఉంది.

ఆకాయ పెద్దదిగా ఉంటే మొత్తం ఫ్రిజ్లో పెట్టకుండా, దాన్ని బయట ఉంచలేం. బయట ఉంచితే దానిపై క్రిములు, ధూళి పడే అవకాశాలు ఉన్నాయి. కట్ చేసిన వెంటనే తినేయాలి. కట్ చేసిన పుచ్చకాయని తేవడం వల్ల మనం ఇంటికి రాగానే వెంటనే తినేయాలి. కానీ అలా తినకుండా మనం అలాగే ఉంచలేం. అలాంటి ఇబ్బంది లేకుండా కట్ చేయనీ పుచ్చకాయ తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దినిని రెండు రోజుల వరకు అయినా మనం అలాగే ఉంచగలం. కానీ కట్ చేసిన పుచ్చకాయని అలా ఉంచలేం. కానీ ఇలా చేయాల్సిన అవసరం లేకుండానే దీన్ని ఈ టిప్స్ ద్వారా కనుగొనండి… పుచ్చకాయలు ఒక్కొక్క సైజులో ఒక్కొక్క రంగులో కనబడుతూ ఉంటాయి.ఏ కాయ మంచిదో, ఏది మంచిగా లేదో. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తాం.. అలాంటి పని లేకుండా పుచ్చకాయను ఈజీగా ఇలా కనిపెట్టేయొచ్చు…

పుచ్చకాయ ఆకారం : పుచ్చకాయని కొనుగోలు చేసేటప్పుడు మీరు ముఖ్యంగా పరిశీలించాల్సింది. పుచ్చకాయ గుడ్డు ఆకారంలో లేదా బంతి ఆకారంలో ఉండాలి. దానికంటూ ఒక నిర్దిష్ట ఆకారం ఉండాలి. అలాంటి పుచ్చకాయ లోపల అన్ని వైపుల సమానంగా పండి ఉంటుంది. అలాగే, గింజలు, రేఖలు క్రమబద్ధమైన ఆకారంలో ఉంటాయి.

పుచ్చకాయ బరువు : పుచ్చకాయని కొనుగోలు చేసేటప్పుడు బరువుగా ఉంటే, అది రుచికరంగా ఉంటుంది. కనీసం రెండు కిలోల బరువు అయినా ఉండాలి. అప్పుడు పండు మధ్యలో మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ చిన్న పుచ్చకాయలలో ఉండదు. కాబట్టి, మీరు కొంచెం పెద్దదిగా ఉండే పుచ్చ‌పండును ఎంచ్చుకోవడం మంచిది. చిన్న కాయ అయితే ధర తక్కువగా ఉంటుంది అని తీసుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు, ఎక్కువ ధ‌ర‌ అయినా సరే,అదే సరిగ్గా పండిన కాయ. కాబట్టి మీరు పెద్దదిగా ఉండే పండును ఎంచుకుంటేనే మంచిది.

పుచ్చకాయ గట్టిగా ఉండాలి : పుచ్చకాయ మృదువుగా ఉండకూడదు. అలా ఉంటే పాడైపోయినట్లే అర్థం. పండును కొన్న రెండు రోజుల్లో తినాలి. ఎందుకనగా, పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

రంగు : పుచ్చకాయ కొనేటప్పుడు దాని చర్మం పొడిగా ఉండాలి. చర్మం పచ్చగా ఉంటే, అది పండి పండు కాదు. మీరు అలాంటి పుచ్చకాయను కత్తిరించినట్లయితే, అది లోపల ఎర్రగా పండి ఉండదు. కాబట్టి, పండిన పుచ్చకాయ పొడి, వాడిపోయినట్లుగా ఉన్నదని ఎంచుకోవాలి. కొన్ని అరుదైన రకం పుచ్చకాయలు కూడా ఉంటాయి. వీటిపై తెల్లని మచ్చలు ఉంటాయి. అలాంటి మచ్చలు ఉన్న పండు చాలా తీయగా లోపల ఎర్రగా ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయాలి.

పసుపు రంగు ఉంటే : కొన్ని రకాల పుచ్చకాయలను గమనించినట్లయితే పచ్చని రంగుకు బదులుగా ఒక వైపు పసుపు రంగును కలిగి ఉంటాయి. అలాంటీ పుచ్చకాయలు కూడా లోపల ఎర్రగా ఉంటాయి. పసుపు రంగుకు గల కారణం. పండు పండినప్పుడు, పసుపు రంగు భాగం నేలకు అతుక్కుపోతుంది. అది నొక్క బడుతుంది. అందువల్ల ఆ భాగం మందంగా అవుతుంది. నిజంగా పుచ్చకాయ విషయంలో కొనేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలను, శ్రద్ధగా వహిస్తే రుచికరమైన పండుని కొని తినవచ్చు. ఇది వేసవికాలం కాబట్టి, పుచ్చకాయలని ఎక్కువగా తింటూ ఉంటారు. అలాంట‌ప్పుడు ఇలాంటి టిప్స్ ని పాటించండి. మీరు పుచ్చకాయను పూర్తిగా పండిన, ఈజీగా కొనుగోలు చేయగలుగుతారు.

Advertisement