అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ(ఎంసీడీ) స్టాండింగ్ కమిటీలో ఖాళీగా ఉన్న స్థానానికి ఇవాళ ఎన్నిక నిర్వహించనుండగా ఢిల్లీ మేయర్‌ షెల్లీ ఓబెరాయ్‌, కమిషనర్‌ అశ్వనీ కుమార్‌ ఎన్నికలను నిలిపేయాలని ఆదేశించారు. ఎన్నికలను అక్టోబర్‌ 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ శుక్రవారం స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక జరుగుతుందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సెనా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌ చట్టవిరుద్దమని, సభ పనితీరులో జోక్యం చేసుకునే అధికారం ఎల్జీకి లేదన్నారు. సభ కార్యాకలాపాలకు అంతరాయం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.