అక్షర టుడే, వెబ్ డెస్క్ Donald Trump : అమెరికా (America) అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. అమెరికా (America) ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా (China) ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్ దేశం సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది. ఈ విషయంలో ట్రంప్ (Donald Trump) తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాడు. సుంకాల విషయంలో తన వైఖరిని మార్చుకునేదే లేదంటున్నారు. చైనాపై (China) మరో 50శాతం ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు.
Donald Trump : అన్నంత పని చేశాడు..
దీంతో అమెరికా , చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తన హెచ్చరికలను చైనా (China)పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఏప్రిల్ 9 అంటే ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ (White House Press Secretary) వెల్లడించారు. చైనా వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా సుంకాలతో 104శాతానికి సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు రాత్రి (అమెరికా స్థానిక కాలమానం) 12.01గంటల నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్ వెల్లడించింది.
ఇటీవల చైనాపై అమెరికా (America) ప్రతీకార సుంకాలు విధించడంతో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని డిమాండ్ చేశారు.. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 2న ట్రంప్ భారత్‌పై (Trump India) 26శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వియత్నాంపై 46 శాతం, చైనాపై 34 శాతం, తైవాన్‌పై 32 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం, జపాన్‌పై 24 శాతం, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఆయా దేశాలు అమెరికాపై చాలా ఎక్కువ సుంకాలను విధిస్తున్నాయని, వాటిపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు