అక్షరటుడే, వెబ్‌డెస్క్ Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మిగతా దేశాలకి వణుకు పుట్టిస్తున్నాడు… టారిఫ్స్ (Trump Tariffs) విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. చైనా వస్తువులపై ఏకంగా 125 శాతం పన్ను విధించారు. ఇదే సమయంలో భారత్ సహా 75 దేశాలపై విధించిన టారిఫ్స్‌ను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు వాషింగ్టన్ నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ట్రంప్ టారిఫ్స్ (Trump Tariffs) అంశం కొత్త మలుపు తిరిగింది. చైనాతో టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండు కీలక ప్రకటనలు చేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు సుంకాల నుంచి ఊరట కల్పించారు.
చైనాపై అమెరికా 104 శాతం పన్ను విధించింది. ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34 శాతంగా ఉన్న పన్నును 84 శాతానికి పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం Trade war తీవ్రస్థాయికి చేరుకుంది. అమెరికా (america) ఉత్పత్తులపై చైనా సుంకాల పెంపును తీవ్రంగా పరిగణించిన ట్రంప్ చైనా ఉత్పత్తులపై ఉన్న 104 శాతం పన్నును 125 శాతానికి పెంచినట్టు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాలను దోచుకొనే రోజులు ఇకపై ఉండవని, అది ఆమోదయోగ్యం కాదని చైనా సమీప భవిష్యత్తులోనే గ్రహిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరిచిందని డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై వాషింగ్టన్ నుంచి శిక్షాత్మక సుంకాల ప్రకటన వెలువడింది. ‘ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరిచినందువల్ల చైనాపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించిన ప్రతీకార సుంకాన్ని నేను 125 శాతానికి పెంచుతున్నాను. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లలో stock market గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఏప్రిల్ 2న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.