అక్షరటుడే, ఎల్లారెడ్డి: కార్తీకమాసం మొత్తం నియమాలు పాటించి, పూజలు చేసినవారంతా ఆ ఫలితం మొత్తం పొందేందుకు సోమవారం పోలిపాడ్యమి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు దీపాలు వెలిగించి భక్తి శతలతో పూజలు చేశారు. పిల్లలు తులసి కోట వద్ద దీపాలు వెలిగించారు. శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.