అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagababu : బాలయ్య, నాగబాబు వీళ్లిద్దరి మధ్య వైరం ఈ నాటిది కాదు. 2019ఎన్నికలకు ముందు నాగబాబు బాలయ్యపై చేసిన సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎంత పెద్ద దుమారం రేపాయో మనం చూశాం. వివిధ సందర్భాలలో బాలయ్య మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నాగబాబు బాలయ్యపై దుమ్మెత్తి పోశాడు. అమితాబ్, చిరంజీవి లాంటి వారు రాజకీయాలలో వచ్చి ఏమి చేయలేకపోయారని, అది ఒక్క ఎన్టీఆర్ వల్లనే సాధ్యం అయ్యిందని, మా బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు అని బాలయ్య చేసిన కామెంట్స్ నాగబాబుని చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ సమయంలో నాగబాబు బాగానే పంచ్‌లు వేశాడు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అందరూ కలిసిపోయారు.
Nagababu : ఫ్యాన్స్ ఆగ్రహం..
అయితే బాలయ్యకి సొంత పార్టీలోనే అన్యాయం జరుగుతుందని కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. బాలయ్య పొలిటికల్ గా చూస్తే నాలుగున్నర దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. మరి టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు అంతా మంత్రులు అయిపోతున్నారు. నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ వేసి ఇప్పుడు మంత్రి అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ తన అన్నని మంత్రి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనే టాక్ గట్టిగా నడుస్తుంది. అయితే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా బాలయ్యకి మంత్రి పదవి దక్కలేదని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
టీడీపీ పార్టీ తనది అయి ఉండి కూడా బాలయ్యకు కనీసం మంత్రి పదవి దక్కక పోవడమేమిటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టీడీపీలో అన్న గారి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది ఒక్క బాలయ్య మాత్రమే కదా, కనీసం ఆయనకి అయిన మంత్రి పదవి ఇస్తే బాగుండేది కదా అని అభిమానులు లాజిక్స్ వెతుకుతున్నారు. తమ అభిమాన హీరోకి నిజంగా అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఫైర్ అవుతున్నారు కూడా. నిజంగా నాగబాబుకి మాత్రం బెర్త్ ఇస్తే ఈ ఇష్యూ మరింత పెద్దది అయ్యేలా ఉందిగా. మరి దీనిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎలా డీల్ చేస్తారనేది.