Waqf | వక్ఫ్ బోర్డుపై ఎందుకీ వివాదం.. అసలు దీని చరిత్ర ఏంటి..!

Waqf | వక్ఫ్ బోర్డుపై ఎందుకీ వివాదం.. అసలు దీని చరిత్ర ఏంటి..!
Waqf | వక్ఫ్ బోర్డుపై ఎందుకీ వివాదం.. అసలు దీని చరిత్ర ఏంటి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Waqf | బోర్డుకు సవరణలు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో Parliament బిల్లు ప్రవేశపెట్టింది. బుధవారం లోక్ సభ సుదీర్ఘంగా చర్చించి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. గురువారం రాజ్యసభలో Rajya Sabha ఈ బిల్లుపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి Waqf బోర్డుపై కేంద్రీకృతమైంది. Waqf బోర్డు అంటే ఏమిటి, ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు, దాని అధికారాలు ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరణలు చేయాలనుకుంటుంది అన్న అంశాలపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో Waqf బోర్డు పూర్వాపరాలపై కథనం. .

Advertisement
Advertisement

Waqf | వక్ఫ్​ అంటే..

వక్ఫ్​ (Waqf) అంటే ఇస్లామిక్ చట్టం Islamic law ప్రకారం మతపరమైన కార్మిక ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేసిన ఆస్తి. ఇస్లాం అనుచరులు దానం చేసిన ఆస్తి అని అర్థం. మనదేశంలో 1954లో మొదటిసారి Waqf చట్టాన్ని తీసుకువచ్చారు. Waqf బోర్డుకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు 1995లో తొలిసారి సవరణలు చేశారు. 2013లో మరోసారి సవరణలు చేసి బోర్డుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. దీని ప్రకారం Waqf బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేని విధంగా అధికారాలు కల్పించారు. అంటే ఆస్తిని ఒకసారి వక్ఫ్​(Waqf)దిగా ప్రకటించినట్లయితే ఇక దానికి ఎదురు ఉండదు. Waqf ఆస్తుల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రంలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 30 Waqf బోర్డులు ఉన్నాయి.

Waqf | భారీగా పెరిగిన ఆస్తులు..

కేంద్ర ప్రభుత్వం 2013లో కల్పించిన విశేషాధికారాలతో Waqf బోర్డు భూమాఫియాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో సాయుధ దళాలు, రైల్వేల తర్వాత అతిపెద్ద భూ యజమానిగా వక్ఫ్​(Waqf) బోర్డు నిలుస్తోంది. దీనికి 2009 నాటికి దేశంలో నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న మూడు లక్షల రిజిస్టర్డ ఆస్తులు ఉన్నాయి. 15 ఏళ్లలో ఇవి రెట్టింపు అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం వక్ఫ్​(Waqf) బోర్డుకు 9.40 లక్షల ఎకరాల్లో సుమారు 8.72 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. 1.20 లక్షల కోట్ల విలువైన 16,713 చరాస్తులు ఉన్నాయని అంచనా.

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Amendment Act | వక్ఫ్‌ సవరణ చట్టంలో ఏముందంటే..!

Waqf | వివాదాస్పదమైందిలా..

తమిళనాడులోని ఓ గ్రామం మొత్తం తమదేనని Waqf బోర్డు ప్రకటించడంతో వివాదం మొదలైంది. అలాగే హర్యానాలోని యమునా నగర్ జిల్లాలో గురుద్వారా ఉన్న భూమిని వక్ఫ్​(Waqf)కు బదిలీ చేశారు. 2021లో గుజరాత్​లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్​ (Waqf) ఆస్తిగా ప్రకటించారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా వివాదాలు నెలకొన్నాయి. Waqf చట్టం విస్తృతంగా దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక మతానికి మాత్రమే మతపరమైన ఆస్తులకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఉండడం, ఇతర మతాలకు అలాంటి అవకాశం లేకపోవడంతో ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కాగా waqf బోర్డు దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి వక్ఫ్ బోర్డు కు సవరణలు చేయాలని నిర్ణయించింది.

Advertisement