అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD CONGRESS | పసుపు బోర్డును ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభించారని నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి (Muppa Ganga Reddy) ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ(congress party) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. అసలు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకే తెలియదని.. రైతులకు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
NIZAMABAD CONGRESS | విధివిధానాలే ఖరారు కాలేదు..
కనీసం ఇప్పటివరకు పసుపు బోర్డు(Turmeric Board) పాలకవర్గం విధివిధానాలు కూడా ఖరారు కాలేదని ముప్ప గంగారెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి(Rural MLA Bhupathi Reddy) జవహర్ నవోదయ కోసం జక్రాన్పల్లి(Jakranpally)ని ప్రతిపాదిస్తే, ఎంపీ అర్వింద్(MP Arvind) జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిగోట్ను ప్రతిపాదించారని గుర్తు చేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.