అక్షరటుడే, వెబ్‌డెస్క్: sand mining | ఇసుక అక్రమ రవాణా illegal sand transportation వ్యవహారంలో ఒక వైపు జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు పలువురు కింది స్థాయి అధికారులు lower-level officials అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలించే illegally transporting sand వ్యాపారులతో కలిసి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా బోధన్ రూరల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) గంగాధర్ ఇసుక అక్రమార్కులకు సహకరించినట్లు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోలేదు. కేవలం షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఐ గంగాధర్ RI Gangadhar కిందిస్థాయి ఉద్యోగి నుంచి బోధన్ రెవెన్యూ డివిజన్ Bodhan Revenue Division పరిధిలోనే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో డివిజన్ మొత్తంలో పట్టుంది. ఇదే సమయంలో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారితో సత్సంబంధాలు maintains good relations కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వ క్వారీలు లేని సమయంలో పలువురు వ్యాపారులతో చేతులు కలిపి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించాడు.
పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా లేని రూట్లలో అక్రమ మైనింగ్ వాహనాలు illegal mining vehicles రాకపోకలు సాగించేలా అన్నీ తానై చూసుకున్నాడు. తాజాగా ఈ బండారం బయటపడినా ఉన్నతాధికారులు మాత్రం విచారణ investigation పేరిట రోజుల తరబడి కాలయాపన చేస్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి MLA Sudarshan Reddy ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. రెవెన్యూశాఖలోని revenue department ఇంటి దొంగలు బయటపడుతుండడం విస్మయం కలిగిస్తోంది.
sand mining | డీడీలు లేకున్నా వేబిల్లులు
ప్రభుత్వ క్వారీల government quarries నుంచి ఇసుకను తరలించాలంటే వేబిల్లులు తప్పనిసరి. కాగా.. బోధన్ రూరల్ మండలం పరిధిలోని ఓ క్వారీ నుంచి గతంలో ఇసుక తవ్వకాలు sand mining జరిపారు. ఇదే సమయంలో ఆర్ఐ గంగాధర్ తనకు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఇసుక వ్యాపారులతో sand traders అన్నీ రకాల అండదండలు అందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం మొదట ప్రభుత్వానికి డీడీ చెల్లిస్తేనే తదుపరిగా వేబిల్లు waybills జారీ చేయాల్సి ఉంటుంది. కానీ.. మరొకరు చెల్లించిన డీడీలను వ్యాపారులకు అప్పగించి వాటి ద్వారా వేలుబిల్లులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీడీ తీసుకున్న యజమాని వాహనంలోనే ఇసుక తరలించాలి. కానీ, ఇక్కడ మాత్రం ఇతరులు కట్టిన డీడీలపై ఇతర వాహనాలకు వే ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.