Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను బహిష్కరిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కులగణన పేరుతో కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ‘కేసీఆర్‌కు సమాజంలో జీవించే హక్కు లేదని రేవంత్ అంటున్నారు.. సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా?’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Advertisement