Supreme Court | ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.. మరోసారి స్పీకర్​కు సుప్రీం నోటీసులు!

Supreme Court | ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.. మరోసారి స్పీకర్​కు సుప్రీం నోటీసులు
Supreme Court | ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.. మరోసారి స్పీకర్​కు సుప్రీం నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Supreme Court | పార్టీ ఫిరాయింపుల(Party defections) కేసులో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్(Congress)​ అధికారంలోకి రావడంతో బీఆర్​ఎస్(BRS)​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్​ స్పీకర్​ను కోరింది. అయితే స్పీకర్(Speaker)​ స్పందించకపోవడంతో బీఆర్​ఎస్(BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి సుప్రీం కోర్టు(Suoreme Court)ను ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసేలా స్పీకర్​ను ఆదేశించాలని వారు కోరారు.

Advertisement
Advertisement

Supreme Court | నోటీసులకు స్పందించని స్పీకర్​

పార్టీ ఫిరాయింపుల అంశంపై విచారణ చేపడుతున్న అత్యున్నత న్యాయస్థానం గతంలో నోటీసులు(Notice) జారీ చేసింది. ఈ నెల 22లోపు స్పందించాలని అందులో పేర్కొంది. అయితే ఆయన ఆ నోటీసులకు స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కాగా గతంలో విచారణ సందర్భంగా స్పీకర్​, అసెంబ్లీ(Assembly) కార్యదర్శి తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని మండి పడింది. స్పీకర్​ నిర్ణయం తీసుకోకుంటే తామే తీసుకోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Supreme Court | వారిలో గుబులు

సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో భయం నెలకొంది. దీంతో కొందరు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి అయితే ఏకంగా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తాను పార్టీ మారలేదని, తనకు తెలియకుండా తన ఫొటోలను కాంగ్రెస్​ ఫ్లెక్సీలపై పెడుతున్నారని కంప్లైట్​ చేశాడు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. ఎక్కడ తమపై వేటు పడుతుందో అని భయపడుతున్నారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ఇటీవల కాంగ్రెస్​ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్​ దూరం

Supreme Court | చట్టం ఏం చెబుతోంది..

పార్టీ ఫిరాయింపులపై రాజీవ్​గాంధీ(Rajeev Gandhi) హయాంలో చట్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్లకు కట్టబెట్టారు. పార్టీ మారిన వారిపై వేటు వేయాలని చెబుతున్న చట్టం ఎప్పటిలోగా వేయాలో మాత్రం స్పష్టం చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకుని స్పీకర్లు నిర్ణయం ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ మారిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గులాబీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. కాగా ఈ కేసులో ఈ నెల 25న జరగనున్న విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Advertisement