JDU leader | రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జేడీయూ నేత సెటైర్

JDU leader | రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జేడీయూ నేత సెటైర్
JDU leader | రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జేడీయూ నేత సెటైర్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: JDU leader | దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ని Congress leader Rahul Gandhi జేడీ(యూ) నాయకుడు సంజయ్ కుమార్ ఝా Sanjay Kumar Jha ఎద్దేవా చేశారు. ‘తన సొంత కులం ఏమిటో తెలియని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన caste census నిర్వహించే బాధ్యతను తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కుల గణన డిమాండ్ ప్రబలంగా ఉన్న సామాజిక వాస్తవాలపై ఆధారపడి ఉండాలని, కేవలం సామాజిక జనాభాకే పరిమితం కాకూడదన్నారు.

Advertisement

రాహుల్ గాంధీ Rahul Gandhi ఇటీవల తరచూ కుల గణనను caste census ప్రస్తావిస్తున్నారు. “తొంభై శాతం మంది ప్రజలు వ్యవస్థ వెలుపల కూర్చున్నారు, వారికి నైపుణ్యాలు, జ్ఞానం ఉన్నాయి కానీ వారికి అవకాశాలు లేవు. అందుకే, మేము కుల ఆధారిత సంస్థాగత గణన కోసం డిమాండ్ ను లేవనెత్తుతున్నామని’’ రాహుల్ గాంధీ అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Congress government | ప్రతిపక్షాల ఉచ్చులో ప్రభుత్వం.. విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలం

‘‘కుల గణన caste census లక్ష్యం కేవలం వివిధ కులాల గణన గురించి తెలుసుకోవడమే కాదు దేశ సంపదలో వాటి భాగస్వామ్యం కూడా. దేశంలోని వివిధ కులాల మధ్య సంపద ఎలా పంపిణీ అవుతుందో తెలుసుకోవడమే ఈ దార్శనికత’’ అని రాహుల్ ప్రస్తావించారు. అయితే, కులగణన caste census చేయాలన్న రాహుల్ డిమాండ్ ను సంజయ్ కుమార్ ఝా Sanjay Kumar Jha ఎద్దేవా చేశారు.

Advertisement