అక్షర టుడే, వెబ్ డెస్క్ Wine Shops : మందుబాబులకి ఇది చేదు వార్త.. రేపు శ్రీరామ నవమి సందర్భంగా వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఏప్రిల్ 6న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు (Wine Shops) బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ (Rachakonda Police Commissionerate) ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో రేపు 12 గంటల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు.
Wine Shops : బ్యాడ్ న్యూస్..
రాములోరి పెళ్లి సందర్భంగా వైన్ షాపులతో (Wine Shops) పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు కూడా ఈ జాబితాలోకి రానున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాచకొండ పోలీసులు (Rachakonda Police) స్పష్టం చేశారు. అయితే నిబంధనలు ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైన్ షాపులు బంద్ (Wine shops closed) అనే వార్త తెలియడంతో మందుబాబులు షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు.
ఇప్పుడు సమ్మర్ కావడం బీర్లకి డిమాండ్ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో మందుబాబులు చల్లటి బీర్ల కోసం (Wine shops closed) వైన్ షాపులకు క్యూ కడుతున్నారు. బీర్ల కొనుగోలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని వైన్ షాపుల్లో స్టాక్ కూడా అయిపోయిందని అంటున్నారు.. ఏప్రిల్ 5 వీకెండ్ కావడంతో వైన్స్ ముందు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీర్ల అమ్మకాలు (Beer sales) బాగా పెరిగాయి. లిక్కర్ (Liquor) సంగతి ఎలా ఉన్నా బీర్లు మాత్రం ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని షాపుల యజమానులు చెబుతున్నారు.