అక్షరటుడే, వెబ్డెస్క్ :Wipro | మరో ఐటీ దిగ్గజ కంపెనీ(IT company) విప్రో కూడా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బుధవారం వెలువరించిన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఫలితాల అనంతరం మేనేజ్‌మెంట్(Management) ఇచ్చిన గైడెన్స్ కామెంటరీ ఇన్వెస్టర్లను నిరాశ పరచడంతో ఈరోజు ఆ స్టాక్ అమ్మకాల ఒత్తిడి(Selling pressure)ని ఎదుర్కొంటోంది. కాగా ఇప్పటికే టీసీఎస్ కూడా ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే..
Wipro | నికర లాభం(Net profit)..
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 26 శాతం పెరిగింది. ఇదే సమయంలో గత త్రైమాసికంతో పోల్చితే 6.3 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.
Wipro | రెవెన్యూ(Revenue)..
ఇయర్ ఆన్ ఇయర్(YOY) అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(Financial Year)తో పోల్చితే 0.74 శాతం తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్(QOQ)లో మాత్రం 0.8 శాతం పెరిగింది. కాగా ఐటీ సేవల ద్వారా లభించే ఆదాయం 0.8 శాతం క్షీణించింది.
Wipro | ఎబిట్..
EBIT(Earning Before Interest and Taxes) కూడా ఒక శాతం పెరిగింది. మార్జిన్స్ 17.5 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
Wipro | డివిడెండ్..
ఒక్కో షేరుపై రూ. 6 డివిడెండ్(Devident) ప్రకటించింది.
Wipro | మేనేజ్‌మెంట్ కామెంటరీ..
అమెరికా విధించే టారిఫ్(US Tariffs)లకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టెక్ సేవ(Tech services)లకు గిరాకీ తగ్గుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం Q1 ఫలితాలపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. దీర్ఘ కాల వృద్ధిపై మాత్రం ఆశావహ దృక్పథంతో ఉంది.
Wipro | స్టాక్ ఫర్మార్మెన్స్(Stock performence)..
ఫలితాల ప్రకటన తర్వాత విప్రో(Wipro) అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 5.5 శాతం పడిపోయి రూ. 234 వద్ద ట్రేడ్(Trade) అవుతోంది. కాగా ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 325 కాగా.. కనిష్ట ధర 208. ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 22 శాతం లాభాలు ఇచ్చిన ఈ కంపెనీ.. ఏడాది కాలంలో పది శాతమే రిటర్న్స్ అందించింది.