అక్షరటుడే, వెబ్డెస్క్: Farmer | వానాకాలంలో వర్షాలు బాగా కురిసి చెరువులు, ప్రాజెక్టులు నిండటంతో ఎన్నో ఆశలతో రైతులు(farmers) యాసంగిలో వరి సాగు చేశారు. జలాశయాల్లో నీరు(Water) సమృద్ధిగా ఉండటంతో పంటలకు డోకా లేదని భావించారు. బోర్లు(Borewells) కూడా బాగానే పోయడంతో పంటలు బాగా పండుతాయని వరి సాగు చేసిన అన్నదాతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండుతుండటంతో కంట నీరు పెట్టుకుంటున్నారు.
Farmer | పడిపోయిన భూగర్భ జలాలు
రాష్ట్రంలో యాసంగిలో రైతులు ఎక్కువ శాతం వరి (Paddy) సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట పలు చోట్ల పొట్టదశలో, కొన్ని ప్రాంతాల్లో ఈనిక దశలో ఉంది. ఇప్పుడు పంటకు నీరు అవసరం. అయితే ఒక్కసారిగా భూగర్భజలాలు (Ground Water) పడిపోవడంతో పంటలకు నీరు అందడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుందని వాపోతున్నారు.
Farmer | దండం పెడతాం నీళ్లు వదలండి
మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు(farmers) రూ.వేలు ఖర్చు చేసి పాలేరు(paleru) వాగులో జేసీబీతో గుంతలు తీయిస్తున్నారు. అందులో వచ్చిన నీటితో పంటలు పండటం లేదని వాపోతున్నారు. ‘దండం పెడతాం.. పాలేరు వాగుకు నీళ్లు వదిలి ఆదుకోవాలని’ కోరుతున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండిపోతుందని, నీళ్లు వదిలి పంటలను కాపాడాలని కోరుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఏకంగా అధికారులను నిర్బంధించారు. ఇలా.. తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో అన్నదాతలు రోజుకో చోట నిరసనలు తెలుపుతున్నారు.