అక్షరటుడే, గాంధారి: Gandhari | కిడ్నాప్ చేసిన తన కొడుకు ఆచూకీ చెప్పాలని ఓ తండ్రి మహిళపై దాడి చేశాడు. ఈ దాడిలో మహిళా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన గాంధారి మండలంలో చోటు చేసుకుంది.
సదాశివనగర్(sadashiva nagar) సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం(Gandhari Mandal) చందానగర్(chanda nagar) తండాకు చెందిన కేతావత్ పీరాజీ కొన్నేళ్లుగా హైదరాబాద్(hyderabad)లో ఉంటూ బేగంపేట(begumpet)లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో అమీనా అనే మహిళ కూడా భిక్షాటన చేసేది.
అయితే కొన్నిరోజుల నుంచి తన నాలుగేళ్ల కొడుకు కనిపించకపోవడంతో అమీనానే ఎత్తుకెళ్లిందని పీరాజీ అనుమానించాడు. దీంతో అమీనాను హైదరాబాద్ నుంచి మేడిపల్లి(Medipalli) అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చి తన కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమీనాపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అమీనా కుడిచేయి విరిగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో గాంధారి(Gandhari) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. సీఐ సంతోష్ కుమార్(ci santhosh kumar), ఎస్సై ఆంజనేయులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడు పీరాజీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.