Bachupalli | కూతురికి విషమిచ్చి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

Bachupalli | కూతురికి విషమిచ్చి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ
Bachupalli | కూతురికి విషమిచ్చి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bachupalli | మేడ్చల్ medchal​ జిల్లా బాచుపల్లి ప్రగతి నగర్​లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ కూతురుకు విషమిచ్చి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నెల 18న సాయంత్రం ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

కృష్ణపావని అనే మహిళ ప్రగతి నగర్​ pragati nagarలో నివాసం ఉంటుంది. ఈ నెల 18న సాయంత్రం ఆమె తన నాలుగేళ్ల కూతురు జశ్వికకు కూల్‌ డ్రింక్‌ cool drinkలో ఎలుకల మందు కలిపి తాగించింది. అనంతరం ఆమె కూడా ఎలుకల మందు తాగింది. శనివారం తెల్లవారుజామున ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జశ్విక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. కృష్ణపావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి పోలీసులు bachupalli police ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Fire Accident | నగరంలో అగ్నిప్రమాదం