అక్షరటుడే, వెబ్డెస్క్: Palm Wine | మెదక్ జిల్లా Medak district నర్సాపూర్ Narsapur మహిళ మిస్సింగ్ కేసును missing case పోలీసులు ఛేదించారు. గత నెల 25వ తేదీన అదృశ్యమైన మహిళను రూ.400 కోసం మహబూబ్‌నగర్ జిల్లాకు Mahabubnagar district చెందిన గోపాల్ హత్య చేసినట్లు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. మహిళ వద్ద ఉన్న రూ.400 చూసిన నిందితుడు గోపాల్.. మాట కలిపి కల్లు(Palm Wine) తాగించాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. కాగా.. తాగుడుకు బానిసైన గోపాల్ డబ్బుల కోసం గత కొంతకాలంగా వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. అతనిపై కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు గోపాల్‌ను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.