Business Idea : 30 వేలతో బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరానికి 70 లక్షలు సంపాదిస్తున్న మహిళ

Business Idea : 30 వేలతో బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరానికి 70 లక్షలు సంపాదిస్తున్న మహిళ
Business Idea : 30 వేలతో బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరానికి 70 లక్షలు సంపాదిస్తున్న మహిళ
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Business Idea : జాబ్ ఎవ్వరైనా చేస్తారు.. కానీ బిజినెస్ చేయాలంటే గట్స్ కావాలి. చాలామంది అనుకుంటారు.. బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలని.. కానీ, పెట్టుబడి అనేది బిజినెస్ చేయడానికి పెద్ద అడ్డంకి కానే కాదు. బిజినెస్ చేయాలంటే పట్టుదల, ఓర్పు, శ్రమ ఉండాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. అలాంటి పనే చేసి చూపించింది ఓ మహిళ. కేవలం 30 వేల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు సంవత్సరానికి రూ. లక్షలు సంపాదిస్తోంది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుభాష్ నగర్​కు చెందిన తారాబాయి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఆవిడ బాగానే చదువుకుంది కానీ.. చదువు పూర్తికాగానే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో తనకు ఏం చేయాలో పాలుపోలేదు. అయినా కూడా పెళ్లి తర్వాత పలు ఉద్యోగాలు చేసింది. కానీ.. తను చదివిన చదువుకు, ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉండడం, జీతం సరిపోకపోవడంతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంది.

Business Idea : అప్పుగా 30 వేలు తెచ్చి.. పెట్టుబడి పెట్టి..

తన వద్ద చాలా బిజినెస్ ఐడియాలు ఉండడంతో 30 వేలు అప్పుగా తీసుకొచ్చి ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ కొనుగోలు చేసింది. ఇంట్లోనే చిన్న చిన్న బ్యాగులు కుడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ అమ్మింది తారాబాయి. మెల్లగా తన బిజినెస్ పుంజుకుంటూ ఉండడంతో పీఎంఈజీపీ ద్వారా కాస్త లోన్ తీసుకొని మరిన్ని మిషన్లను కొనుగోలు చేసి 10 మంది మహిళలను పనిలో పెట్టుకొని రోజూ వందల సంఖ్యలో బ్యాగులను తయారు చేయడం ప్రారంభించింది. ఇలా.. ఇప్పుడు రోజుకు వేలల్లో సంచులను తయారు చేస్తూ మార్కెట్లలో విక్రయిస్తూ సంవత్సరానికి లక్షలు సంపాదిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది తారాబాయి.

Advertisement