Womens Day | అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

Womens Day | అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు
Womens Day | అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: Womens Day | నేటి సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని జడ్పీ మాజీ ఛైర్​పర్సన్​ దఫేదార్​ శోభా రాజు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పురుషులతో సమానంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Womens Day | ఆత్మవిశ్వాసంతో ముందుకు..

మహిళలు ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వాలు సహకారం అందించాలని దఫేదార్​ శోభ విజ్ఞప్తి చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. వారి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మహిళల్లో శక్తి సామర్థ్యాలు అపారమని.. వాటిని ఉపయోగిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar | ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్