అక్షరటుడే, కామారెడ్డి: ఓ ఇంట్లో గొడవ జరుగుతుండగా.. పక్కింటి మహిళ అడ్డొచ్చి సర్ది చెప్పే ప్రయత్నంలో హత్యకు గురైంది. కామారెడ్డి మండలం తిమ్మప్పల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజశేఖర్ తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. వారిని కొట్టే ప్రయత్నం చేయగా.. పక్కింట్లో ఉండే నారాయణ, లక్ష్మి, రాజు అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులను కొట్టడం తప్పు అని చెప్పిన పక్కింటి మహిళ లక్ష్మీపై రాజశేఖర్ ఇటుకతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచి కోసం వెళ్తే.. ఏ తప్పూ లేని మహిళ ప్రాణం తీశారని గ్రామస్థులు పేర్కొన్నారు.