అక్షరటుడే, ఎల్లారెడ్డి: yellareddy | అత్తింటి వేధింపులు భరించలేక ఓ విహహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం ఐలాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. ఏఎస్సై ప్రకాష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..
ఐలాపూర్ గ్రామానికి చెందిన బిక్కల బాలయ్య కుమార్తె సులోచనను కోర్పోల్ గ్రామానికి చెందిన కుమార్కు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. కాగా.. భర్త కుమార్, బావ రవి, తోటి కోడలు లలిత, అత్త సంగవ్వ, ఆడపడుచు సాయవ్వ తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. ఇదే విషయంలో గతంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఇటీవల పుట్టింటికి వెళ్లి ఉంటోంది.
అయితే, తీవ్ర మనోవేదనకు గురైన సులోచన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.