అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న అభరణాలు దోచుకెళ్లారు. ఆర్మూర్ పట్టణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. సంతోష్ నగర్ కు చెందిన లాస్య(21) భర్త రాకేష్ గల్ఫ్ దేశంలో ఉపాధి కోసం వెళ్లగా.. తన అత్త చిన్నూబాయితో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. శనివారం అత్త చిన్నూబాయి బయటకు వెళ్లగా ఏడు నెలల చిన్నారితో కలిసి లాస్య ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్య ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.