అక్షరటుడే, ఇందూరు : District Judge | మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత విద్యనభ్యసించాలన్నారు.
మహిళలు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ తీసుకోవాలని జడ్జి సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకు చట్టాల మీద అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశాలత, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, డీఎల్ఎస్ఏ సెక్రెటరీ పద్మావతి, న్యాయమూర్తులు కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వసంతరావు, దీపక్, పిల్లి శ్రీకాంత్, కవితా రెడ్డి, నీరజ, పరిపూర్ణరెడ్డి, రజిత, మానస, అపూర్వ, రమ పాల్గొన్నారు.