అక్షరటుడే, ఇందూరు : Women’s Day | మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ అద్భుతాలు సృష్టించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యా క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.
మహిళలు తమ హక్కులను, బాధ్యతలను మరిచిపోకుండా ముందుకు సాగాలన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు, ఆయా సంస్థలు అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి, అదనపు న్యాయమూర్తి పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, స్నేహ సొసైటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.