అక్షరటుడే, ఇందూరు: COLLECTOR | మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector rajiv Gandhi Hanumanthu) సూచించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు(women’s Day) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు ఏ రంగంలో ఉన్నా బాధ్యతలు మర్చిపోవద్దన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా సంక్షేమాధికారి రసూల్బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిణి పద్మశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, టీఎన్జీవోస్ జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.