అక్షరటుడే, బాన్సువాడ: పిట్లం మండలం కారేగావ్ గ్రామానికి చెందిన వివాహిత మ్యాతరి సుగుణ గురువారం సాయంత్రం మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బొల్లక్ పల్లి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకుతుండగా స్థానికులు గమనించారు. అనంతరం ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. నది లోతుగా ఉండడంతో సుగుణ నీటిలో గల్లంతయ్యింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.