అక్షరటుడే, వెబ్‌డెస్క్: forest : ఎండాకాలం(summer).. తునికాకు సేకరణకు మంచి తరుణం.. అందుకే ఆ మహిళలు తునికాకు సేకరణకు అటవీప్రాంతానికి వెళ్లారు. అలా అలా దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లి దారి తప్పారు.
ఇంటికి వచ్చేందుకు వెనక్కి వద్దామంటే.. ఎటు వైపు వెళ్లాలో అర్థం కాలేదు. దీంతో బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు.. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ అడవిలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ అధికారులు వారి కోసం అడవంతా జల్లెడ పట్టారు.
కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజా సమీపంలోని అటవీ ప్రాంతంలో తునికాకు తెంపడానికి వెళ్లారు. అలా దట్టమైన అటవీ ప్రాంతాని(forest area)కి చేరుకుని దారి తప్పిపోయారు. పొద్దున వెళ్లిన మహిళలు(women) ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Nirmal District SP Janaki Sharmila) తక్షణం స్పందించారు. మూడు స్పెషల్ పార్టీ బృందాల(special party teams)ను ఏర్పాటు చేయించి, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. డ్రోన్ కెమెరాలతోనూ గాలింపు కొనసాగించారు. చివరికి మహిళల ఆచూకీ గుర్తించి, వారిని క్షేమంగా ఇంటికి చేర్చారు.
తమవాళ్లను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు(Police), అటవీశాఖ సిబ్బంది(forest officials)కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని తెలియజేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో మూడు స్పెషల్ పార్టీ బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్(rescue operation) కొనసాగించాయి.