అక్షరటుడే, వెబ్డెస్క్: TDP | పార్టీ కార్యకర్తలకు గుర్తింపునిస్తామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు CM Chandrababu Naidu అన్నారు. పనులన్నీ కార్యకర్తల ద్వారానే జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ లైన్ కు విరుద్ధంగా ఎవరైనా పని చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
TDP | తెలుగు జాతి ఉన్నంత కాలం..
తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ TDP ఉంటుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ TDP నాశనానికి ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం టీడీపీకి తప్ప మరే పార్టీకి సాధ్యం కాలేదన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ NTR అని గుర్తు చేశారు.
TDP | పనిచేసిన వారికే పదవులు
పార్టీలో పని చేసేవాళ్లకే పదవులు ఇస్తామని చంద్రబాబు CM Chandrababu స్పష్టం చేశారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరు సిఫార్సు చేసినా పదవులు ఇవ్వనని ఆయన చెప్పారు.
TDP | త్వరలో మెగా డీఎస్సీ
ఆంధ్రలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల teacher posts భర్తీకి ఏప్రిల్లో మెగా డీఎస్సీ Mega DSC వేయనున్నట్లు సీఎం చంద్రబాబు CM Chandrababu తెలిపారు. మేలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు.