kamareddy bjp | స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

kamareddy bjp | స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
kamareddy bjp | స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

అక్షరటుడే, కామారెడ్డి: kamareddy bjp | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (mla venkata ramana reddy) అన్నారు. పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్​లో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ గ్రామాన పార్టీ జెండా ఆవిష్కరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుందని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement