Advertisement
అక్షరటుడే, బోధన్: పట్టణంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తరలిస్తున్నారనే వార్తలతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా శనివారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారు. ఫ్యాక్టరీని బోధన్ నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని తమకు రావాల్సిన తొమ్మిదేళ్ల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్లూర్ శ్రీనివాస్, కార్మిక నాయకులు రవిశంకర్ గౌడ్, ఉపేంద్ర, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement