World’s Most Expensive Mango | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది.. కిలో రూ.3 లక్షలు!

World’s Most Expensive Mango | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది.. కిలో రూ.3 లక్షలు
World’s Most Expensive Mango | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది.. కిలో రూ.3 లక్షలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: World’s Most Expensive Mango : మామిడి పండ్లు ఎంత ధర ఉంటాయి. కిలో రూ.100 లేదా రూ.200, మరీ తియ్యని రసాలు అయితే కిలో రూ.500 లోపే ఉంటుంది కానీ.. మామిడి పండ్ల ధర ఎక్కడా వేలకు వేలు, లక్షలకు లక్షలు ఉండదు. కానీ, ఈ మామిడి పండ్ల ధర ఎంతో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ మామిడి పండ్లు ధర కిలో రూ.3 లక్షలు. అవును.. మీరు చదివింది నిజమే. ఈ మామిడి మన దేశంలో పండదు. జపాన్ లో ఈ మామిడిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. అక్కడ కూడా ఈ సాగు అరుదే. దీన్ని అసలు ఇది అత్యంత ఖరీదైన మామిడి రకం అని తెలియక కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఓ రైతు తన టెర్రస్ మీద పండించాడు. దీని పేరు మియాజాకి మామిడి పండు. మొదటిసారి అది కాయలు కాయగానే ఇంట్లో వాళ్లంతా అవి తినేశారు. అసలు ఈ మామిడి పండ్ల ధర కిలోకు కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు ఉంటుందని కూడా ఆయనకు తెలియదు. కానీ, ఓ విలేకరి ఆ చెట్టు పండ్లను చూసి దాని విలువ చెప్పే సరికి ఆ రైతు నోరెళ్లబెట్టినంత పని అయింది.

World’s Most Expensive Mango : ఈ మొక్కను పెంచడం అంత ఈజీ కాదు

ఇది అత్యంత అరుదైన రకం, అత్యంత ఖరీదైన పండుగా ఉండటానికి కారణం ఆ మొక్కను పెంచడం అంత ఈజీ కాదు. ఏమాత్రం కెమికల్స్ వాడినా ఆ చెట్టు బతకదు. దానికి కావాల్సిన పోషకాలను ఖచ్చితంగా అందించాలి. ఉడిపికి చెందిన ఆ రైతు దాన్ని ఎలా పెంచాడో చెప్పుకొచ్చాడు. గేదె పేడ, గొర్రె పేడ, కూరగాయల వ్యర్థాలు, పెరుగుతో ఒక మిశ్రమాన్ని తయారు చేసి దాంట్లో మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని ఆ చెట్టుకు ఎరువుగా వేసేవారు. మొక్కకు సూర్య కాంతి కూడా తగలాలి. అలాగే తగినంత నీరు ఉంటే ఆ మొక్క ఏపుగా పెరిగి కాయలు కూడా కాస్తుందని ఆ రైతు చెప్పుకొచ్చారు. ఈ మామిడి గురించి తెలుసుకున్న స్థానికులు, తమకు కూడా ఒక మొక్కను ఇవ్వాలంటూ ఆ రైతు ఇంటి దగ్గర క్యూ కట్టారు.

Advertisement