అక్షరటుడే, బాన్సువాడ: డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 28 రేషన్ దుకాణాల డీలర్ల నియామకానికి శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాత పరీక్షలు నిర్వహించారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్ పరీక్షను పర్యవేక్షించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 14న ఆర్డీవో కార్యాలయంలో ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన సూచించారు. మొత్తం 295 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 8 మంది గైర్హాజరయ్యారు.