అక్షరటుడే, వెబ్‌డెస్క్: exam center : నిబంధనలకు విరుద్ధంగా పదో తరగతి పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్ సెంటర్ తెరిచి ఉంచడంతోపాటు మైక్రో జిరాక్సులు తీస్తున్న వైనాన్ని ఓ రిపోర్టర్ ఫొటోలు తీశాడు. దీంతో రెచ్చిపోయిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు సదరు రిపోర్టర్‌పై దాడికి యత్నించాడు. ఈ ఘటన కోటగిరి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద జరిగింది. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రానికి వంద మీటర్ల దూరంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి. కానీ, సదరు నిర్వాహకుడు దర్జాగా తెరిచి మైక్రోజిరాక్స్‌లు తీసి ఇవ్వడంతో ఫొటోలు తీసేందుకు యత్నించిన రిపోర్టర్‌పై దాడికి దిగాడు. బాధిత రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
exam center | పరీక్ష కేంద్రం వద్ద జిరాక్స్ సెంటర్..ఫొటోలు తీసిన రిపోర్టర్‌పై దాడి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement