Vijaysai Reddy : తననీ తన భార్యనీ అవమానించిన విజయసాయి రెడ్డికి జగన్ షాకింగ్ కౌంటర్

Vijaysai Reddy : తననీ తన భార్యనీ అవమానించిన విజయసాయి రెడ్డికి జగన్ షాకింగ్ కౌంటర్
Vijaysai Reddy : తననీ తన భార్యనీ అవమానించిన విజయసాయి రెడ్డికి జగన్ షాకింగ్ కౌంటర్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Vijaysai Reddy : ప్రస్తుతం (YSRCP Party) వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో ఏపీ మొత్తం తెలుసు. ఏపీ రాజకీయాల్లో అదే పెద్ద చర్చ. వైసీపీ నేతలు సడెన్ గా జగన్ కు ఎదురు తిరుగుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదో చోటా మోటా లీడర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే లైట్ తీసుకోవచ్చు కానీ.. జగన్ పాలనలో కీలకంగా ఉన్న వ్యక్తి, జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా (YCP)వైసీపీపై బురద జల్లుతుండటంతో వైసీపీ హైకమాండ్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

జగన్ (Jagan)చుట్టూ ఉన్న కోటరీ వల్లనే తాను చాలా నష్టపోయానని విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వెంటనే కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కూడా తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అంటే ఎవరు? జగన్ (Jagan) కోటరీ అంటే ప్రజలే. ఆ ప్రజల వల్ల నువ్వు నష్టపోయావా? అంటూ విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అమర్నాథ్.

ఇది కూడా చ‌ద‌వండి :  Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి జగన్ కోటరీ మీద అంత కోపం రావడానికి కారణం ఇదే !

Vijaysai Reddy : చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?

ప్రతి రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉంటుంది. అంతెందుకు (Chandrababu) చంద్రబాబు చుట్టు కోటరీ లేదా? ఆ కోటరీలోనే ఉన్న మనం.. ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నో కీలకమైన పదవులు అనుభవించి.. ఇప్పుడు అధికారంలో లేదు కదా అని పార్టీని వీడి.. నీడనిచ్చిన పార్టీపై బురద జల్లడం కరెక్ట్ కాదు. ఢిల్లీలో ఉన్నప్పుడు విజయసాయి ఏం మాట్లాడారు? ఇక్కడ విజయవాడకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే వ్యక్తులను ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ఆయన వ్యాఖ్యలను ప్రజలు హర్షించరు.. అంటూ (Gudivada Amarnath) అమర్నాథ్, జయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

Advertisement