అక్షరటుడే, కామారెడ్డి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే కనీసం ఖండించడం లేదన్నారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకుండా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నిర్వహించలేదని, క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండా కూడా ఎగురవేయలేదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తన వ్యక్తిగత సిబ్బందితో నాయకులను బెదిరిస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులతో కాకుండా వ్యక్తిగత సిబ్బందితో ఇప్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన