అక్షరటుడే, ఎల్లారెడ్డి: విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్యే మదన్మోహన్ రావును ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ జనవరి 26న డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తామని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు సైతం నిధులు కేటాయించి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్, విద్యాసాగర్, నీలకంఠం తదితరులున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ ఛైర్మన్
Advertisement
Advertisement