అక్షరటుడే, ఎల్లారెడ్డి: YELLAREDDY | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు(MLA MADAN MOHAN RAO) కోరారు. సోమవారం అసెంబ్లీ(ASSEMBLY)లో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట(LINGAMPET) మండల కేంద్రంలో ఉన్న నాగన్న దిగుడు బావి కట్టడం ఎంతో అబ్బురపరుస్తుందని పేర్కొన్నారు. బావికి ఇటీవలే మరమ్మతులు చేయించి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు దోహదం చేశామని, లింగంపేటలోని నాగేశ్వరాలయం ముందు గాలికి ఊగే ధ్వజస్తంభం ప్రత్యేకమన్నారు.
YELLAREDDY | త్రిలింగ రామేశ్వరాలయం..
నాగిరెడ్డిపేట(NAGIREDDY PET) మండలం తాండూర్లోని త్రిలింగ రామేశ్వరాలయం ఉందని మూడు లింగాలు ఒకే చోట కలిగిన ఆలయం ఎక్కడ లేదన్నారు. మంజీర నది లింగాకారంలో ప్రవహిస్తుండడంతో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని వివరించారు. ఇటీవలే ఆలయ అభివృద్ధికి అడుగులు పడ్డాయని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మారిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
YELLAREDDY | కాలభైరవ స్వామి ఆలయం..
రామారెడ్డి మండల కేంద్రంలోని కాలభైరవ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయంలో ఎలాంటి వసతులు లేవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయాన్ని ఎంతోమంది ప్రముఖులు సందర్శించారని, ఆలయాన్ని అభివృద్ధి పర్చాలని కోరారు. తాడ్వాయి మండలంలోని భీమేశ్వరాలయం సైతం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా పేరుగాంచిందన్నారు.