హత్య కేసును ఛేదించిన పోలీసులు

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డిలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన నేరస్థుడు పరకాల రాజు అలియాస్ జీవన్ గతేడాది అక్టోబరులో అదే గ్రామానికి చెందిన మద్దేల కమలమ్మ (70)ను గొంతు నలిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ రవీందర్ నాయక్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా.. నిందితుడు రాజు అలియాస్ జీవన్ పరారీలో lఉన్నట్లు గుర్తించారు. శెట్పల్లి సంగారెడ్డి చౌరస్తాలో రాజును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు రాజు, లిక్యా నాయక్ ను అభినందించారు.