అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని ఆయా శాఖల అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సూచించారు. ఎల్లారెడ్డిలోని తన కార్యాలయంలో గురువారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, విద్యుత్, అంగన్వాడీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్న వేళ చెరువుల కట్టలు, తూములు, చెక్ డ్యాంలు తెగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పలు శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరాతీశారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, శాఖల అధికారులు పాల్గొన్నారు.