అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల సత్యనారాయణ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మిగితా 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఆయనపై అవిశ్వాస నోటీసును అందజేశారు. కాగా.. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. క్యాంపులో ఉన్న 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ నేరుగా అవిశ్వాసంపై జరిగిన ఓటింగ్ ప్రక్రియకు హాజరయ్యారు. వీరంతా కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడే ఫలితాలు బయటకు వెల్లడించవద్దని హైకోర్టు సూచించింది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. తదనంతరం నూతన్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.