NASA | ఒక్క ఐడియాతో రూ.25 కోట్లు గెలుచుకోవచ్చు.. త్వరపడండి

NASA | ఒక్క ఐడియాతో రూ.25 కోట్లు గెలుచుకోవచ్చు.. త్వరపడండి
NASA | ఒక్క ఐడియాతో రూ.25 కోట్లు గెలుచుకోవచ్చు.. త్వరపడండి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NASA | భూమిపై నుంచి చందమామ Moon ఎంతో అందంగా కనిపిస్తాడు. మనం చిన్నప్పటి నుంచి చందమామ కథలు వింటూ పెరిగాం. అయితే చంద్రుడిపై ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు Scientists ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అక్కడి వాతావరణంతో పాటు, నీటి జాడ, ఇతర వనరుల గురించి పరిశోధించడానికి అనేక దేశాలు రూ.వేల కోట్లు వెచ్చించి ప్రయోగాలు Experiments చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా America అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా NASA పలుమార్లు మనుషులను చంద్రుడి మీదకు పంపింది.

Advertisement
Advertisement

NASA | వారి వ్యర్థాలు అక్కడే..

నాసా ఇప్పటి వరకు ఆరు సార్లు చంద్రుడిపైకి వ్యోమగాములను Astronauts పంపింది. అయితే వారికి సంబంధించిన 96 సంచుల మానవ వ్యర్థాలు అక్కడే ఉండిపోయాయి. అక్కడికి వెళ్లిన వ్యోమగాములు తిరిగి వచ్చేటప్పుడు మట్టి, రాళ్లు తదితర నమూనాలు తీసుకొని వచ్చారు. దీంతో స్థలభావం దృష్ట్యా మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు. మాములుగా అంతరిక్షంలో నుంచి వ్యర్థాలను తీసుకు రావడం చాలా సవాళ్లతో కూడిన పని.

NASA | ఎలా వినియోగించాలో చెబితే ప్రైజ్​మనీ

చంద్రుడిపై ఉండిపోయిన మానవ వ్యర్థాలను రీసైకిల్​ Recycle చేయడానికి ఐడియా చెప్పాలని నాసా ఆహ్వానించింది. దీని కోసం లూనా రీసైకిల్​ Luna Recycle అనే ఛాలెంజ్​ను తీసుకొచ్చింది. మానవ వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువులుగా మార్చడానికి ఐడియా చెప్పాలని కోరింది. భవిష్యత్​లో అంతరిక్ష యాత్రలకు ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తోంది. ఈ క్రమంలో మంచి ఐడియా చెప్పి ఛాలెంజ్​లో గెలిచిన వారికి రూ.25 కోట్లు ప్రైజ్​ మనీ ఇస్తామని ప్రకటించింది.

Advertisement