అక్షర టుడే, వెబ్ డెస్క్ Lifestyle Eating Fish : అందరూ చేపలు చాలా ఇష్టంగా తింటుంటారు. చేపలు వారానికి కనీసం రెండుసార్లు తింటే ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు. చేపలను తరచూ తీసుకుంటే రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్ పేరుకు పోకుండా చూస్తాయి. అంతేకాదు, వారానికి రెండుసార్లు తీసుకునే వారిలో గుండెపోట్లు, పలు జబ్బులు తక్కువైతాయి.
చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వులు, ఇతర పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే మంచి ప్రోటీన్ అందుతుంది. అంతే కాదు తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. చేపల్లో విటమిన్ డి ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తుంది. ఎముకలు బలంగాను, ఆరోగ్యంగా ఉండేలా చేపలు ఎంతో సహకరిస్తాయి.
ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాలు.. రక్తనాళాలను శుద్ధి చేస్తూ కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రిస్తుంది. కాబట్టి వారానికి రెండుసార్లు అయినా చేపలు తినడం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతే కాదు చేపలను తినని వారి కంటే, చేపలు తినే వారిలో గుండెపోటు, జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుందని వివరించారు. చేపలు తింటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే, ఒత్తిడి, ఆందోళన, టెన్షన్లను కూడా తగ్గిస్తుంది.