అక్షరటుడే, వెబ్ డెస్క్: నగర శివారులోని బోర్గాం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బోర్గాం గ్రామానికి చెందిన దాయిని ప్రదీప్(28) మంగళవారం సాయంత్రం మోపాల్ నుంచి బోర్గాం గ్రామానికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన ప్రదీప్ ను స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ ప్రదీప్ మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్ తెలిపారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్నారు.